Ap News: కళాకారుడు దారుణ హత్య.. ముళ్ల పొదల్లో మృతదేహం
అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ...
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaya District)లో దారుణం జరిగింది. గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లె(Bodireddygari village)లో కళాకారుడు(Artist) దారుణ హత్య(Murder)కు గురయ్యారు. కళాకారుడు వెంకట రమణను చంపిన దుండగులు గుట్టు చప్పుడు కాకుండా బస్టాప్ సమీపంలోని ముళ్లపొదల్లో మృతదేహాన్ని పాడేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే రక్తపు మరకలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. బోడిరెడ్డిగారి పల్లెలో కళాకారుల మధ్య గొడవ జరిగిందని పోలీసులు గుర్తించారు. తోటి కళాకారులే వెంకట రమణను కొట్టి చంపినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని జైలుకు తరలిస్తామని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు.