AP News:శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలి:డీఎస్‌పీ

పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని మైదుకూరు డి.ఎస్.పి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

Update: 2024-12-21 15:20 GMT

దిశ,పోరుమామిళ్ల: పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని మైదుకూరు డి.ఎస్.పి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ ను సాధారణ తనిఖీలలో భాగంగా సందర్శించారు. అనంతరం స్టేషన్ లోని పెండింగ్ కేసు వివరాలను, రికార్డు మెయింటెన్స్ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కొండారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.


Similar News