Weather Alert : రానున్న 24 గంటల్లో ఏపీకి భారీ వర్షాలు

ఏపీకి వాయుగుండం ముంపు కొనసాగుతోంది.

Update: 2024-12-21 16:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీకి వాయుగుండం ముంపు కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 430 కి.మీ. దూరంలోనూ, చెన్నైకి ఈశాన్యంగా 480 కి.మీ., గోపాల్​పూర్​కు 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తూర్పు, ఈశాన్యం దిశగా రాగల 12 గంటలపాటు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా సముద్రంలోనే బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల దృష్ట్యా విశాఖపట్టణంలోని అన్ని స్కూళ్లకు కలెక్టర్​ సెలవు ప్రకటించారు. పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికారులతో సమీక్షించి పరిశీలిస్తున్నారు. వారికి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించారు. 

Tags:    

Similar News