Professor Madhumurthy: ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ మధుమూర్తి
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి(AP Higher Education) చైర్మన్‌గా ప్రొఫెసర్ మధుమూర్తి(Professor Madhumurthy) నియమితులయ్యారు.
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి(AP Higher Education) చైర్మన్‌గా ప్రొఫెసర్ మధుమూర్తి(Professor Madhumurthy) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్(Kona Shasidhar) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా మధుమూర్తి ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వరంగల్)లో మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ గా, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గుంటూరు(Guntur) జిల్లా తెనాలి(Tenali) మండలం జాగర్లమూడి(Jagarlamudi) గ్రామంలో ఆయన జన్మించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్(B.tech), వరంగల్ నిట్ లో ఎంటెక్(M.tech), పీఎచ్డీ(PHD) పూర్తి చేశారు.