నగరంలో మంచినీటికి అంతరాయం.. ఏయే ప్రాంతాలంటే !

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు చాంద్రాయణగుట్ట గుర్రంచెరువు కట్ట తెగి భారీగా నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే కట్టకు సమాంతరంగా ఉన్న కృష్ణా ఫేస్-3 రింగ్ మెయిన్-1.. 1500 ఎంఎం డయా పైపులై‌న్‌కు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్‌కు కృష్ణా నది నుంచి మంచినీటిని సరాఫరాను జలమండలి నిలిపివేసింది. దీంతో మైలార్‌దేవ్‌పల్లి, బుద్వేల్, హైదర్‌గూడ, అత్తాపూర్, సులేమానగర్, భోజగుట్ట, మెహదీపట్నం, కార్వాన్, అల్లాబండ, షేక్‌పేట, టోలిచౌకి, లాంగర్‌హౌస్, […]

Update: 2020-10-18 09:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు చాంద్రాయణగుట్ట గుర్రంచెరువు కట్ట తెగి భారీగా నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే కట్టకు సమాంతరంగా ఉన్న కృష్ణా ఫేస్-3 రింగ్ మెయిన్-1.. 1500 ఎంఎం డయా పైపులై‌న్‌కు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్‌కు కృష్ణా నది నుంచి మంచినీటిని సరాఫరాను జలమండలి నిలిపివేసింది. దీంతో మైలార్‌దేవ్‌పల్లి, బుద్వేల్, హైదర్‌గూడ, అత్తాపూర్, సులేమానగర్, భోజగుట్ట, మెహదీపట్నం, కార్వాన్, అల్లాబండ, షేక్‌పేట, టోలిచౌకి, లాంగర్‌హౌస్, కిస్మత్‌పూర్, మణికొండ, ఎంఎం పహాడి, మాదాపూర్, ప్రశాసనగర్, శాస్త్రీనగర్, మల్లేపల్లి, రాజేంద్ర‌నగర్‌ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News