ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి.. మరో మృతదేహం లభ్యం

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి కనిపించింది.

Update: 2025-03-25 02:51 GMT
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి.. మరో మృతదేహం లభ్యం
  • whatsapp icon

దిశ, అచ్చంపేట/ వెబ్ డెస్క్: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ (SLBC Tunnel Rescue Operation) లో కీలక పురోగతి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామ సమీపంలోని ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ఫిబ్రవరి 22న జరిగిన 14 కిలోమీటర్ వద్ద చోటుచేసుకున్న ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన ఏడు మంది కోసం జరుగుతున్న సహాయక చర్యల్లో 32వ రోజున మరో మృతదేహం లభించడంతో పురోగతి కనిపిస్తున్నది. సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ టన్నెల్ లో మరో మృతదేహం (Another Dead Body) లభ్యమైంది. కన్వేయర్ బెల్ట్ కి 50 మీటర్ల దూరంలో రెస్క్యూ సిబ్బంది మరో మృతదేహాన్ని గుర్తించారు. హిటాచీతో మట్టి, నీరు తవ్వుతుండగా డెడ్ బాడీ కనిపించింది. మృతదేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది (Rescue Team) సహాయక చర్యలు చేపట్టారు. టన్నెల్ లో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఆరుగురి కోసం సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై ఆ మృతదేహం ఎవరిది అనేది గుర్తించి అధికారుల నిర్ధారిస్తూ ప్రకటన చేయాల్సి ఉంది.

ప్రస్తుతం ఐఏఎస్ శివశంకర్ (IAS Shiva Shankar) ఆధ్వర్యంలో టన్నెల్ లో 32 వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revath Reddy) ఎస్ఎల్‌బీసీ టన్నెట్ ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష (Review) చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి, మృతదేహాలను వెలికి తీసేందుకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా నెల రోజుల క్రితం జరిగిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో 8 మంది కార్మికులు చిక్కకుపోయారు. వారిని వెలికి తీసేందుకు ప్రభుత్వం సహయక చర్యలు చేపట్టింది. ఈ సహాయక చర్యల్లో దాదాపు 25 బృందాలుగా 700 మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

 


Similar News