TG Assembly: నేను అవయవ‌దానానికి సిద్ధం.. అసెంబ్లీలో కేటీఆర్ కీలక ప్రతిపాదన

అసెంబ్లీ సమావేశాల్లోAssembly Sessions) భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narsimha) ప్రవేశపెట్టారు.

Update: 2025-03-27 07:21 GMT
TG Assembly: నేను అవయవ‌దానానికి సిద్ధం.. అసెంబ్లీలో కేటీఆర్ కీలక ప్రతిపాదన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లోAssembly Sessions) భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narsimha) ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. అవయవ దానం బిల్లుకు బీఆర్ఎస్ (BRS) తరఫున తాము సంపూర్ణ మద్దతును ఇస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జీవన్‌దాన్ (Jeevandaan) ద్వారా 3,724 మంది బాధితులు ఆర్గాన్స్ (Organs) కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అవయవ దానానికి అందరినీ ప్రోత్సహించే బాధ్యత ప్రజాపతినిధులుగా అందరిపై ఉందని అన్నారు. ఈ విషయంలో పార్టీ అందరి తరఫున తాను మాట్లాడంలేదని.. వ్యక్తిగతంగా తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు. స్పీకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ అవరణలో అవయవ దానంపై పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ (Paper Signing Campaign) నిర్వహించాలని కోరారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అవయవ దానంపై క్యాంపులు ఏర్పాటు చేయాలని.. ఆ విషయంలో తాను ముందు ఉంటానని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ అవయవ దానంపై ప్రతిజ్ఞ చేయాలని కోరారు. అసెంబ్లీ నుంచి ప్రజలకు సందేశం పంపాలని స్పీకర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News