వందల సంఖ్యలో వాహనాలు సీజ్
దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా, అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తున్న వాహనాలను గుర్తించి నల్లగొండ పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలోని మీర్ బాగ్ కాలనీని రెడ్‌జోన్‌గా ప్రకటించినప్పటికీ రాత్రి 8.00గంటల ప్రాంతంలో తెరిచి ఉంచి విక్రయాలు చేస్తున్న కిరాణా షాప్‌ను జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ ఆదేశాల మేరకు నల్లగొండ ఎంఆర్ఓ, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డిల సమక్షంలో రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా టూ టౌన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 7.00 గంటల […]
దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా, అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తున్న వాహనాలను గుర్తించి నల్లగొండ పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలోని మీర్ బాగ్ కాలనీని రెడ్‌జోన్‌గా ప్రకటించినప్పటికీ రాత్రి 8.00గంటల ప్రాంతంలో తెరిచి ఉంచి విక్రయాలు చేస్తున్న కిరాణా షాప్‌ను జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ ఆదేశాల మేరకు నల్లగొండ ఎంఆర్ఓ, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డిల సమక్షంలో రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా టూ టౌన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 7.00 గంటల తర్వాత తెరిచి ఉన్న మరో ఆరు షాప్ లను సైతం సీజ్ చేసినట్టు డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి వివరించారు. ప్రజలంతా పోలీసులతో సహకరిస్తూ లాక్ డౌన్ సజావుగా సాగడంతో బాధ్యతాయుతంగా ఉండాలని, స్వీయ నియంత్రణతో ఇండ్లలోనే ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ వన్ టౌన్ సీఐ నిగిడాల సురేష్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రాజశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు నర్సింహులు, నరేష్‌ల ఆధ్వర్యంలో వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వందల సంఖ్యలో వాహనాలు సీజ్ చేశారు.
Tags : Vehicles, Siege, roads, violation, regulations, nalgonda, dsp, sp