ఆ 53 టీఎంసీల నీటిని వాడుకోండి
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా నదిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలను ఎలా వినియోగించుకోవాలో ఏపీ, తెలంగాణను కృష్ణా నది బోర్డు దిశానిర్ధేశం చేసింది. దీనిపై బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులతో కృష్ణా నది బోర్డు సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఉన్ననీటిని పంపకాలు చేసింది. ప్రస్తుతం తెలంగాణ 36 టీఎంసీలు, ఏపీ 17 టీఎంసీలు వాడుకోవాలని ఆదేశించింది. ఈ నీటిని ఆగస్ట్ 31 వరకు నీటిని వాడుకునేలా బోర్గు అనుమతి ఇచ్చింది. కాగా […]
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా నదిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలను ఎలా వినియోగించుకోవాలో ఏపీ, తెలంగాణను కృష్ణా నది బోర్డు దిశానిర్ధేశం చేసింది. దీనిపై బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులతో కృష్ణా నది బోర్డు సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఉన్ననీటిని పంపకాలు చేసింది. ప్రస్తుతం తెలంగాణ 36 టీఎంసీలు, ఏపీ 17 టీఎంసీలు వాడుకోవాలని ఆదేశించింది. ఈ నీటిని ఆగస్ట్ 31 వరకు నీటిని వాడుకునేలా బోర్గు అనుమతి ఇచ్చింది. కాగా తెలంగాణ క్వారీ ఓవర్ నీటిని కావాలని కోరింది. దీనిపై త్రిసభ్య కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని కృష్ణా నది బోర్డు తెలిపింది.