కేసీఆర్ ఇలాఖా నుంచే షర్మిల యాక్షన్ ప్లాన్.. నేటి నుంచి స్టార్ట్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వారికి భరోసా కల్పించేందుకు షర్మిల ఆదివారం నుంచి ‘రైతు వేదన యాత్ర’ల పేరిట పరామర్శించనున్నారు. ఈ యాత్రను సీఎం కేసీఆర్​ఇలాఖా నుంచే ఆమె ప్రారంభించనున్నారు. యాసంగిలో వరి వేయవద్దని సీఎం కేసీఆర్ చెప్పడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యల బాట పడుతున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు. గడిచిన రెండేండ్లలోనే […]

Update: 2021-12-18 17:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వారికి భరోసా కల్పించేందుకు షర్మిల ఆదివారం నుంచి ‘రైతు వేదన యాత్ర’ల పేరిట పరామర్శించనున్నారు. ఈ యాత్రను సీఎం కేసీఆర్​ఇలాఖా నుంచే ఆమె ప్రారంభించనున్నారు. యాసంగిలో వరి వేయవద్దని సీఎం కేసీఆర్ చెప్పడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యల బాట పడుతున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు. గడిచిన రెండేండ్లలోనే 200 మందికి పైగా ప్రాణాలు వదిలారని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని వైయస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు.

రైతు ఆవేదన యాత్రలో భాగంగా తాను కూడా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికంగా కొంత సహాయాన్ని అందించనున్నారు. ఈ యాత్రలు వచ్చే ఏడాది జనవరి 17 వరకు కొనసాగనున్నట్లు లోటస్​పాండ్ ​వర్గీయులు స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలోని, నర్సాపుర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండలం, కంచనపల్లిలోని గుండ్ల శ్రీకాంత్, మహేష్ అనే రైతుల కుటుంబాలను ఆమె ఆదివారం పరామర్శించనున్నారు. అనంతరం నర్సాపుర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం, లింగంపల్లి గ్రామంలో షేకులు అనే రైతు కుటుంబాన్ని షర్మిల కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఈ యాత్ర మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సాగనుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న 200 మంది రైతు కుటుంబాలకు ఆమె ధైర్యం చెప్పనుంది.

Tags:    

Similar News