గేమర్లను టార్గెట్ చేస్తున్న ‘క్రిప్టోజాకింగ్’ మాల్‌వేర్

దిశ, ఫీచర్స్ : క్రిప్టోజాకింగ్ అనేది హానికరమైన క్రిప్టోమైనింగ్ మాల్‌వేర్. ఇది వినియోగదారులకు తెలియకుండా వ్యక్తిగత కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ డివైజ్‌లలోకి ప్రవేశించి, క్రిప్టోకరెన్సీ వాలెట్లను దొంగిలిస్తుంది. దీని వల్ల డివైజ్‌లు స్లో డౌన్ కావడంతో పాటు, క్రాష్ అయ్యే అవకాశం ఉంది. సైబర్ క్రిమినల్స్ ప్రధానంగా గేమర్స్‌ను టార్గెట్ చేస్తూ దీన్ని ఆయా పరికరాల్లోకి ప్రవేశపెడుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఈ తరహా దాడులు గణనీయంగా పెరిగాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గేమర్లు తస్మాజ్ జాగ్రత్త […]

Update: 2021-06-27 02:29 GMT

దిశ, ఫీచర్స్ : క్రిప్టోజాకింగ్ అనేది హానికరమైన క్రిప్టోమైనింగ్ మాల్‌వేర్. ఇది వినియోగదారులకు తెలియకుండా వ్యక్తిగత కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ డివైజ్‌లలోకి ప్రవేశించి, క్రిప్టోకరెన్సీ వాలెట్లను దొంగిలిస్తుంది. దీని వల్ల డివైజ్‌లు స్లో డౌన్ కావడంతో పాటు, క్రాష్ అయ్యే అవకాశం ఉంది. సైబర్ క్రిమినల్స్ ప్రధానంగా గేమర్స్‌ను టార్గెట్ చేస్తూ దీన్ని ఆయా పరికరాల్లోకి ప్రవేశపెడుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఈ తరహా దాడులు గణనీయంగా పెరిగాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గేమర్లు తస్మాజ్ జాగ్రత్త అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్యాంకులు లేని ఓ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ‘క్రిప్టో‌కరెన్సీ’ అంటారన్నది తెలిసిన విషయమే. ఆన్‌లైన్‌లో డిజిటల్ ఎంట్రీల ద్వారా చెల్లింపులు చేస్తారు. ఇటీవల కాలంలో దీనికి బాగా డిమాండ్ పెరగడంతో చాలామంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రిమినల్స్ క్రిప్టోకరెన్సీ కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రధానంగా ఫేమస్ గేమ్స్‌(GTA V)ను లక్ష్యంగా చేసుకుని క్రిప్టోజాకింగ్ మాల్వేర్‌ను డివైజ్‌లోకి సెండ్ చేస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ‘అవాస్ట్’ నివేదిక ప్రకారం గ్రాండ్ తెఫ్ట్ ఆటో వి (జిటిఎ వి), ఎన్బిఎ 2 కె 19, ప్రో ఎవల్యూషన్ సాకర్ 2018 వంటి పాపులర్ గేమ్స్‌లలో హ్యాకర్లు మాల్వేర్లను దాచిపెడుతున్నారు. హ్యాకర్లు ఉపయోగిస్తున్న ఈ ప్రత్యేకమైన క్రిప్టోజాకింగ్ మాల్వేర్‌ను క్రాకోనోష్ అని పిలుస్తారు. ఈ మాల్వేర్ చొప్పించి, హ్యాకర్లు ఇప్పటివరకు 2 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించారని పరిశోధకులు అంటున్నారు.

క్రౌడ్ సోర్స్ క్రిప్టోమైనింగ్ ఆపరేషన్లకు క్రిప్టోమైనింగ్ మాల్వేర్ ప్రసిద్ది చెందింది. నివేదికల ప్రకారం, క్రిప్టోకరెన్సీ రంగంలో భారీ పెరుగుదల నేపథ్యంలో క్రాకోనోష్ వంటి క్రిప్టోజాకింగ్ మాల్వేర్ సంఘటనలు ఏడాది నుంచి పెరుగుతున్నాయి. 2021 మొదటి త్రైమాసికంలో ఇటువంటి క్రిప్టోమైనింగ్ మాల్వేర్ 200,000 సందర్భాలను గమనించినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పరెస్కీ నివేదించింది.

మాల్‌వేర్ ఇప్పటికే భారత్‌తో సహా డజను దేశాల్లోని పరికరాల్లో గుర్తించాం. ఇండియాలో 13,779, బ్రెజిల్‌లో 16,584, అమెరికాలో 11,856, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 8,946, ఫిలిప్పీన్స్‌లో 18,448, పోలాండ్‌లో ఇప్పటివరకు 12,727 సంఘటనలు కనుగొన్నాం. క్రాకోనోష్ పరికరాల్లో విండోస్ అప్డేట్స్‌ను నిలిపివేస్తుంది. దీన్ని గుర్తించకుండా నిరోధించడానికి సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తుంది.
-అవాస్ట్‌ పరిశోధకులు

Tags:    

Similar News