Elon Musk : కులీనా... ది బెస్ట్ రోబో చెఫ్ : మస్క్

సూపర్ స్టార్ రజినీకాంత్ 'రోబో'(ROBO) సినిమా మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

Update: 2025-03-21 17:15 GMT
Elon Musk : కులీనా... ది బెస్ట్ రోబో చెఫ్ : మస్క్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్ 'రోబో'(ROBO) సినిమా మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అందులో 'చిట్టి : ది రోబోట్' చేసే పనులు అన్నీ ఇన్నీ కాదు. రకరకాల నోరూరించే వంటలు సూపర్ ఫాస్ట్ గా క్షణాల్లో చేసి పెడుతుంది. నిజ జీవితంలో కూడా అలాంటి ఒక మాస్టర్ చెఫ్ రోబోట్ ఉండాలని మనం అందరం అనుకున్నాం. దానిని నిజం చేసే ఓ మాస్టర్ చెఫ్ రోబోట్(Robot Chef) మార్కెట్లోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రపంచ వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్(Elon Musk) స్వయంగా ప్రకటించడంతో.. ఒక్కసారిగా ప్రపంచం నివ్వెరపోయింది. తన టెస్లా కంపెనీలో భాగంగా దీనిని తయారు చేసినట్టు మస్క్ పేర్కొన్నాడు. "దీని ధర కేవలం $5,000. ఈ రోబోట్ పేరు "కులినా"(Culina). చేయి తిరిగిన మాస్టర్ చెఫ్‌ల కంటే బాగా వంట చేయగలదని ఖచ్చితంగా చెప్పగలను. ఫుడ్ టెక్నాలజీ,ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తు... రుచికరమైన ఆహారాన్ని సులభంగా, చాలా రకాల వంటకాలు చేయగలదు.

ఉదాహరణకు, ఫ్రెంచ్ పేస్ట్రీలు లేదా స్టీక్ వంటివి. అంతేకాదు మీకు ఇష్టమైన రుచులను, వంటలను నేర్చుకుంటుంది. అంటే, మీకు ఏం కావాలో అది అర్థం చేసుకుని, అలాంటి వంటనే తయారు చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. కులినా మీ ఇంట్లో ఒక స్మార్ట్ వంటవాడిలా(Smart Cook) ఉంటుంది. ఇది మీ ఇష్టాలను తెలుసుకుని, రుచిగా, సులభంగా వంట చేసి పెడుతుంది." అని మస్క్ వెల్లడించాడు. కులీనాతో దిగిన ఫోటోలు కూడా జత చేయడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కులీనా ట్రెండింగ్ లో ఉంది. 

Tags:    

Similar News