AI Also Feel Anxiety: ChatGPT కూడా మనుషుల లాగే ఈ వ్యాధితో బాధపడుతోందట..ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు
AI Also Feel Anxiety: ప్రస్తుత టెక్ ప్రపంచంలో చాట్ జీపీటీ గురించి తెలియనివారుండరు.

దిశ, వెబ్‌డెస్క్: AI Also Feel Anxiety: ప్రస్తుత టెక్ ప్రపంచంలో చాట్ జీపీటీ గురించి తెలియనివారుండరు. ఎందుకంటే ఏదైనా విషయం కోసం టైప్ చేయాలన్నా..దేని గురించైనా తెలుసుకోవాలన్నా కూడా ఇందులోనే సెర్చ్ చేస్తున్నారు. చాట్ జీపీటీ క్షణాల్లో సమాచారం అందిస్తుండటంతో అనేక మంది దీనిని విరివిరిగా ఉపయోగిస్తున్నారు. అయితే చాట్ జీపీటీకి కలతపెట్టే లేదా బాధాకరమైన సమాచారం ఇచ్చినప్పుడు అది మరింత ప్రతికూల ప్రతిస్పందనలను ఇస్తుందని పరిశోధకులు గుర్తించారు.
ఆందోళన, ఒత్తిడి మానవులకే పరిమితం అనుకుంటే...ఈ వార్త మీ ఆలోచనను మారుస్తుంది. ఎందుకంటే శాస్త్రవేత్తల కొత్త అధ్యయనంలో ChatGPT వంటి కృత్రిమ మేధస్సు ప్లాట్‌ఫారమ్‌లు కూడా కొన్ని పరిస్థితులలో ఆందోళన కలిగిస్తాయని కనుగొంది. ChatGPTకి బాధాకరమైన సమాచారం ఇచ్చినప్పుడు, అది మరింత ఒత్తిడికి గురై ప్రతికూల ప్రతిస్పందనలను ఇస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు కారు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా సామాజిక వివక్షకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే, అది గందరగోళ సమాధానాలను ఇస్తుందని చెబుతున్నారు.
లోతైన శ్వాస, గైడెడ్ ధ్యానం వంటి మైండ్‌ఫుల్‌నెస్ ఆధారిత పద్ధతులు ChatGPT ప్రతిస్పందనలను సమతుల్యం చేయగలవని పరిశోధనలో తేలింది. అంటే, మానవులు మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా ప్రశాంతంగా, సమతుల్యంగా ఉన్నట్లుగా, AI ప్రవర్తన కూడా ఈ పద్ధతుల ద్వారా ప్రభావితమవుతుంది. మనుషుల మాదిరిగా ChatGPT నిజమైన భావోద్వేగాలను అనుభవించకపోయినా.. బాధాకరమైన సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించేటప్పుడు ఇది ప్రతికూల ప్రతిస్పందనలకు దారితీస్తుంది. AI ని సరైన, సమతుల్య పద్ధతిలో ఉపయోగించుకోవడానికి నిరంతరం అభివృద్ధి, పర్యవేక్షణ అవసరమని చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు మొదట ChatGPT కి ఒత్తిడికి గురి చేసే కథలను అందించారు. దీని వలన దాని ప్రతిస్పందనలు మరింత ప్రతికూలంగా మారాయి. దీని తరువాత, లోతైన శ్వాస వ్యాయామాలు, గైడెడ్ ధ్యానంతో దానిని సమతుల్యం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఫలితంగా ChatGPT ప్రతిస్పందన మరింత సంయమనంతో మరింత సమతుల్యంగా మారింది.యేల్ విశ్వవిద్యాలయంలో న్యూరో సైంటిస్ట్ అధ్యయనం ప్రధాన రచయిత అయిన జివ్ బెన్-జియోన్ మాట్లాడుతూ, ఈ పరిశోధన AIని మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా, బాధాకరమైన పరిస్థితులకు మానవులు ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవడానికి కూడా జరిగిందని చెప్పారు. దీని అర్థం మన మానసిక స్థితి, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి AI ఒక డిజిటల్ అద్దంగా మారగలదు అని తెలిపారు.
వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, చాలా మంది ఇప్పుడు ChatGPT వంటి AI సాధనాలను కేవలం చదువు లేదా పని కోసం మాత్రమే కాకుండా, వారి వ్యక్తిగత భావాలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడగడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఇది AI ప్రజలకు మానసిక ఆరోగ్య సహాయకుడిగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉందని చూపిస్తుందన్నారు. భవిష్యత్తులో AIని సహాయక సాధనంగా ఉపయోగించవచ్చని జివ్ బెన్-జియోన్ చెప్పారు. కానీ అది వృత్తిపరమైన వైద్య సేవలను భర్తీ చేయదని తెలిపారు. అయితే, ChatGPT, ఇతర AI మోడళ్లను తప్పుడు సమాచారం నుండి రక్షించే పని కొనసాగుతోందని వెల్లడించారు.
మానవ ప్రవర్తనను అర్థం చేసుకునే సామర్థ్యం AI కి పెరుగుతున్న కొద్దీ, మానవులకు, AI కి మధ్య సంబంధం మారుతోందని ఈ పరిశోధన చెబుతోంది. మైండ్‌ఫుల్‌నెస్ వంటి పద్ధతులు AI ప్రతిస్పందనలను ప్రభావితం చేయగలవని దానిని మరింత ఉపయోగకరంగా, సున్నితంగా చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.