WhatsApp: భారత్ లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్.. అందులో మీ అకౌంట్ ఉందా?
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 99.67లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది.

దిశ, వెబ్ డెస్క్: WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 99.67లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది. వీటిలో 13.27లక్షల ఖాతాలను వినియోగదారుల నివేదిక లేకుండానే నిషేధించారు. కంపెనీ ప్రకారం ఫ్లాట్ ఫారమ్ భద్రతను బలోపేతం చేసేందుకు, స్పామ్, స్కామ్స్ ను నిరోధించేందుకు ఈ చర్య తీసుకున్నారు. నిషేధించిన ఖాతాలు 2021 ఐటీ నిబంధనలను ఉల్లంఘించాయని వాట్సప్ వెల్లడించింది. స్పామ్, చట్టవిరుద్ధ మెసేజ్ లను పంపడం, మోసాలు, ఫేక్ న్యూస్ షేర్ చేయడం, తప్పుదారి పట్టించే సమాచారాన్నివ్యాప్తి చేయడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడం, చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా మోసపూరిత ట్రాన్సాక్షన్స్ తో సంబంధం కలిగి ఉండటం వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని వాట్సాప్ అకౌంట్ను పూర్తిగా నిలిపివేసినట్లు వాట్సాప్ తెలిపింది.
2025 జనవరిలో 99లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ తన రిపోర్టులో వెల్లడించింది. వేరే కస్టమర్స్ ఫిర్యాదు ఇవ్వడానికి ముందే 13లక్షల 27వేల అకౌంట్లను ముందుస్తుగా బ్యాన్ చేసింది. ఇక జనవరిలో కస్టమర్ల నుంచి 9వేల 474 ఫిర్యాదులు అందాయి. వాటిలో 239 ఖాతాలను పూర్తిగా నిషేధించినట్లుగా వాట్సాప్ ప్రకటించింది. వీటిలో ఇమెయిల్స్ , పోస్టల్ మెయిల్ ద్వారా ఇండియాగ్రీవెన్స్ ఆఫీసర్స్ కు సమాచారం అందినట్లుగా సంస్థ వెల్లడించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లోని (1)(డి), 3ఏ(7)కింద కొన్ని విధానాలు ఉల్లంఘించినందుకు ఖాతాలను బ్యాన్ చేసినట్లు తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే వాట్సాప్ అకౌంట్స్ ను గుర్తించి చర్య తీసుకునేందుకు వాట్సాప్ ఆటోమేటెడ్ సిస్టమ్, యూజర్ ఫీడ్ బ్యాక్ ఉపయోగిస్తుంది. స్పామ్, తప్పుడు ఇన్ఫర్మేషన్ , మోసపూరిత కార్యకలాపాలు జరిపిన అకౌంట్ ను వాట్సాప్ డిలీట్ చేస్తుంది. చట్ట ఉల్లంఘనలను వాట్సాప్ ఎలా గుర్తిస్తుందంటే మల్టీలెవల్ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది.
దీనికోసం మూడు వ్యవస్థలు మూడు కీలక దశల్లో పనిచేస్తాయని తెలిపింది. మొదటి దశలో అనుమానాస్పద అకౌంట్స్ ఫ్లాగ్ చేసి..సైన్ ఆప్ టైంలో బ్లాక్ అవుతాయి. రెండో దశలో మెసేజ్ చేసేటప్పుడు వాట్సాప్ ఆటోమెటెడ్ సిస్టమ్ లు బల్క్ మెసేజింగ్ లేదా స్పామ్ వంటి వాటిని నిరంతరం పర్యవేక్షిస్తాయి. మూడో దశలో కస్టమర్ ఫిర్యాదు చేస్తే అకౌంట్స్ బ్యాన్ అవుతాయి. వాట్సాప్ అకౌంట్ ను దుర్వినియోగం చేయడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినపుడు బాధిత వ్యక్తుల అకౌంట్స్ ను కూడా వాట్సాప్ గమనిస్తుంది. దర్యాప్తు చేసిన అనంతరం చర్యలు తీసుకుంటుంది.