Egg of the Sun: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.. ఏకంగా ఎన్ని లక్షలంటే..?
సమ్మర్ రాగానే అందరికీ ముందుగా మామిడి పండ్లే గుర్తొస్తాయి.

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్ రాగానే అందరికీ ముందుగా మామిడి పండ్లే గుర్తొస్తాయి. మ్యాంగోస్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడని వారంటూ ఉండరు. పైగా మామిడి పండ్లు ప్రయోజనాలు కూడా అనేకం. మామిడి పండులో రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. వీటిలో విటమిన్-C తోపాటు విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ K, ప్రోటీన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు దరి చేరవు.
మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపడటానికి మేలు చేస్తుంది. మామిడి పండ్లలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలోని విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు చర్మం అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. మామిడి పండ్లలో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతాయి. ఎముకలను స్ట్రాంగ్ చేయడంలో, కంటిచూపును మెరుగుపర్చడంలో, వెయిట్ లాస్ అయ్యేందుకు, రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు మేలు చేస్తాయి.
అయితే ఎగ్ ఆఫ్ ది సన్ గా పిలిచే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు గురించి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సూర్యుడి గుడ్డు అని పిలువబడే ఈ అత్యంత ఖరీదైన మామిడి పండు ధర ఏకంగా రూ. 3 లక్షలు అట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ఖ్యాతి పొందింది. ఈ పండును విలాసానికి చిహ్నంగా సూచిస్తారు.
ఈ పండు దాని తీవ్రమైన రూబీ ఎరుపు రంగు కారణంగా ‘సూర్యుని గుడ్డు’ అనే బిరుదును సంపాదించుకుంది. ఈ పండు 20 వ శతాబ్దం మధ్యలో దేశ విచిత్ర వాతావరణానికి అనుగుణంగా ఎంపిక చేశారు. సంతానోత్పత్తిని ఉపయోగించి.. కష్టపడి అభివృద్ధి చేసిన పండుగా చెప్పుకుంటారు.
ఈ మామిడి పండు ధర 350 నుంచి 550 గ్రాముల మధ్య ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే..? చక్కెర కంటెంట్ అలాగే తీపి కూడా ఎక్కువగానే ఉంటుంది. మృదువైన ఆకృతిలో ఫైబర్స్ ఉండనప్పటికీ.. దీని సుగుంధ పరిమళం దాని రాజ ఆకర్షను పెంచుతుంది.
అయితే 2021 లో బీహార్‌లోని ధకానియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ అనే రైతు జపాన్ నుంచి రెండు మొక్కల్ని తీసుకొచ్చాడు. ఈ చెట్టు కొత్తవే అయినప్పటికీ కూడా మొదటి ఏడాదిలోనే 21 మామిడి పండ్ల కశాయి. ఇక ఈ పండ్లను కీటకాలు నష్టం నుంచి ప్రతి మామిడి పండును ఒక్కొక్కటిగా చుట్టి ఉంచుతాడట. ఇటీవల భారతదేశంలో కూడా ఈ పండుకు డిమాండ్ పెరుగుతుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.