Terrible: వామ్మో.. ఒకే చోట 80 పాము పిల్లలు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో 80 పాము గుడ్లు బయటపడిన ఘటన కలకలం రేపింది...

దిశ, వెబ్ డెస్క్: ఒక పామును చూస్తేనే హడలిపోతాం. అలాంటి ఒకే చోట 80 పాము పిల్లలను చూస్తే ఎంకేమన్నా ఉందా గుండెలు ఆగిపోవడం ఖాయం. అదే పొదల్లోనే, ఖాళీ స్థలంలోనో పాములు కనిపించి ఉంటే కచ్చితంగా బిత్తర పోయే వాళ్లు. కానీ అటవీ శాఖ కార్యాలయంలో ఈ 80 పాము పిల్లలు కనిపించాయి. దీంతో ఆశ్చర్యంగా చూశారు.
ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం(Markapuram)లో జరిగింది. మార్కాపురం పట్టణ శివారు ప్రాంతంలో రెండు వారాల క్రితం రెండు పాములు(Two snakes) 120 గుడ్లు పెట్టాయి. దీంతో స్నేక్ కేచర్ నిరంజన్(Snake Catcher Niranjan)కు స్థానికులు సమాచారం అందించారు. ఈ మేరకు పాము గుడ్ల(Eggs)ను స్వాధీనం చేసుకున్న ఆయన అటవీ శాఖ(Forest Department) కార్యాలయంలో వేర్వేరు ఇసుక డబ్బాల్లో భద్రపరిచారు. కొద్దిరోజులకు 80 పాములు పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో పాము పిల్లల వీడియో వైరల్ అయింది.