CM Chandrababu : ఉచిత ఇళ్లపై సీఎం కీలక ప్రకటన

ఉచిత ఇళ్ల(Free Houses)పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) కీలక ప్రకటన జారీ చేశారు.

Update: 2025-03-25 13:35 GMT
CM Chandrababu : ఉచిత ఇళ్లపై సీఎం కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఉచిత ఇళ్ల(Free Houses)పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) కీలక ప్రకటన జారీ చేశారు. మంగళవారం రెవెన్యూ సమస్యలపై కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లల్లో అర్హులైన అందరికీ ఉచిత ఇళ్ళు మంజూరు చేస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇస్తామని మరోసారి తెలియజేశారు. ఇప్పటికే స్థలాలు పొందిన వారు కోరిన విధంగా ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. స్వర్ణాంధ్ర 2047(Swarnandhra 2047) విజన్ కు 10 సూత్రాల ఆధారంగా పని చేయాలన్నారు. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామాల వారీగా పక్కగా ప్లాన్ తో అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. గ్రామాల్లో, మండలాల్లో వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలు నెలకొల్పే విధంగా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని అన్నారు.

Tags:    

Similar News