Ap: తెలుగువారి పండగకు పకడ్బందీ ఏర్పాట్లు.. భారీగా నిధుల విడుదల
తెలుగువారి పండగకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో తెలుగువారి ప్రతిష్టాత్మక పండగను ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం(Ap Government) రెడీ అయింది. ఉగాది ఉత్సవాలకు భారీగా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు 30న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం(Vijayawada Tummalapalle Art Center)లో ఉగాది వేడుకలను అధికారులు వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు రూ. 5 కోట్లు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు.
ఈ మేరకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆధ్వర్వంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఆ రోజు పంచాంగ శ్రవణంతో పాటు కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉగాది వేడుకలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగువారు గర్వపడేలా వేడుకలు జరగాలని సూచించారు. ఉగాది రోజు పీ4 పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలుకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉగాది ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు.