జిల్లాలో భారీగా సీఐల బదిలీలు
వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఐలను భారీగా బదిలీ చేస్తూ కర్నూలు డిఐజి కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ,కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఐలను భారీగా బదిలీ చేస్తూ కర్నూలు డిఐజి కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో తిరుపతి పీటీసీలో పనిచేస్తున్న యు సదాశివయ్య ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు, ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎం.యుగంధర్ ను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ స్టేషన్ కు, ఆళ్లగడ్డ స్టేషన్ లో పనిచేస్తున్న చిరంజీవిని కర్నూలు ఫ్యాక్షన్ కు బదిలీ చేశారు. అన్నమయ్య జిల్లాలో విఆర్ లో ఉన్న కె.యల్లమ రాజును కడప ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఉమెన్ పోలీస్ పోలీస్ స్టేషన్ లో సిఐ గా ఉన్న ఎం కృష్ణారెడ్డిని చెన్నూరు అప్ గ్రేడ్ స్టేషన్ కు బదిలీ చేశారు.
చెన్నూరు లో పనిచేస్తున్న పురుషోత్తం రాజును వైఎస్ఆర్ జిల్లా కేంద్రంలోని స్పెషల్ బ్రాంచ్ -1కు బదిలీ చేశారు .ఎస్బిఐ లో పని చేస్తున్న టీ రెడ్డప్పను కడప సిసిఎస్ -2 కు బదిలీ చేశారు. సిసిఎస్-2 లో పనిచేస్తున్న చాంద్ భాషను పులివెందుల అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అలాగే పులివెందులలో పనిచేస్తున్న టి.నరసింహులును వేంపల్లి అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అలాగే వేంపల్లి స్టేషన్ లో పనిచేస్తున్న ఏ సురేష్ రెడ్డిని కడప వి ఆర్ కు బదిలీ చేశారు. డిసీఆర్బీలో పనిచేస్తున్న యు.వెంకట్ కుమార్ ను కడప విఆర్ఓకు, కడప విఆర్‌లో పనిచేస్తున్న ఆర్ కృష్ణంరాజు నాయక్ ను కడప సిసియస్ -1కు బదిలీ చేశారు. సిసిఎస్- 1 లో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని కడప విఆర్ఓ బదిలీ చేశారు. కర్నూలు విఆర్ లో ఉన్న వి. శ్రీహరిని మైదుకూరు అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ కు, నంద్యాల లో విఆర్ లో ఉన్న ఎం గంగిరెడ్డిని నంద్యాల సిసిఎస్ 2 కు బదిలీ చేస్తూ డి ఐజి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.