Breaking News : బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి
ఆన్లైన్ బెట్టింగ్(Online Betting) భూతానికి మరో యువకుడు బలై పోయాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఆన్లైన్ బెట్టింగ్(Online Betting) భూతానికి మరో యువకుడు బలై పోయాడు. బెట్టింగ్ యాప్స్(Betting Apps) లో భారీగా డబ్బులు పెట్టి, మోసపోయిన ఏపీ(AP)కి చెందిన యువకుడు ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఏపీలోని కడప(Kadapa) జిల్లాకు చెందిన ప్రేమ్ సాయి(Prem Sai) అనే యువకుడు తొందరగా డబ్బులు సంపాదించాలి అనే అత్యాశతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టేవాడు. మొదట్లో తక్కువ డబ్బులు పెట్టినపుడు డబ్బులు వస్తున్నాయని ఆశపడి తర్వాత ఎక్కువ డబ్బులు పెట్టడం మొదలు పెట్టాడు. అవి లాస్ అవడంతో ఎలాగైనా ఆ మొత్తం డబ్బులు తిరిగి రాబట్టుకోవాలని అందినచోట అప్పులు చేసి మరీ దాదాపు రూ.8 లక్షల వరకు యాప్స్ లో పెట్టాడు.
చివరకు అవి కూడా కోల్పోవడంతో.. అప్పులు ఇచ్చిన వారికి ఎలా చెల్లించాలో తెలియక.. ఇంట్లో వారికి మొహం చూపించలేక చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. బెట్టింగ్ యాప్స్ లను నమ్మకూడదని ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు ఎంతగా ప్రచారం చేసినా.. అవి ఏ మాత్రం ప్రయోజనం ఉండటం లేదని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెడుతున్నవారు లక్షల్లో ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.