Ap: పదో తరగతి సోషల్ పరీక్షపై సందిగ్ధత... తొలగించిన ప్రభుత్వం
రాష్ట్రంలో పదో తరగతి సోషల్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది...
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పదో తరగతి సోషల్ పరీక్ష(10th grade social exam) యథాతథంగా జరుగుతుందని ప్రభుత్వం(Government) స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే(Optional holiday) ఇచ్చినంత మాత్రాన పదో తరగతి పరీక్షకు సంబంధం లేదని వెల్లడించింది. మంగళవారం ఉదయం 9.45 నుంచి 12.45 వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులందరూ హాజరుకావాలని ప్రభుత్వం సూచించింది. యథావిధిగా పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని స్పష్టం చేసింది. దీంతో పరీక్షపై విద్యార్థుల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. అటు విద్యాశాఖ అధికారులు సైతం స్పందించారు. పదో తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతుందని తెలిపారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మార్చి నెల 31తో పరీక్షలు ముగుస్తాయని ప్రకటించారు. అయితే రంజాన్ సందర్భంగా ఈ రోజు జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. మంగళవారం నిర్వహిస్తామని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం మంగళవారాన్ని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడంతో పదో తరగతి సోషల్ పరీక్ష ఉందా లేదా అనే అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాజాగా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మంగళవారం పదో తరగతి సోషల్ పరీక్ష యథావిధిగా జరగుతుందని స్పష్టం చేసింది.