రేపు, ఎల్లుండి ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు రెండు రోజుల పాటు నిరసన వ్యక్తం చేయనున్నారు.

Update: 2025-04-01 17:29 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు రెండు రోజుల పాటు నిరసన వ్యక్తం చేయనున్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపించారు. ఈ మేరకు నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్లతో పాటు ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగా గురువారం, శుక్రవారం అన్ని డిపోల్లో ఎన్ఎమ్‌యూఏ ఆధ్వర్యంలో ఎర్రబ్యాడ్జీలతో నిరసన చేపట్టనున్నారు. ఉద్యోగుల సస్పెన్షన్లు, తొలగింపులు లేకుండా చేయాలని, ఈ మేరకు 1/2009 సర్యులర్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా పదోన్నతలు లేవని, మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలని కోరారు. నైట్ అవుట్ అలవెన్సులు రూ.400 ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు.

Similar News