పంచాయతీ కార్యదర్శి ఇంటిపై దాడి తగదు
వీరప్పనాయన పల్లె పంచాయతీ కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి ఇంటిపై దాడి తగదని మండలం లోని పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

దిశ,పోరుమామిళ్ల: వీరప్పనాయన పల్లె పంచాయతీ కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి ఇంటిపై దాడి తగదని మండలం లోని పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆర్ రమణారెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం తో పాటు నినాదాలు చేశారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు సుందర్ సుకుమార్, సీనియర్ కార్యదర్శులు ఓబులేసు, రాజీవ్ రెడ్డి, నారాయణ బాబు, చెన్నకేశవరెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చేవారు ఉండరని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా కార్యాలయాల్లో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలే తప్ప ఇళ్లపై దాడి చేయడం అనాగరికమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఉన్నతాధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.