పవన్‌లాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్(Pawan Kalyan) లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కల్యాణ్‌తో కలిసి ఇవాళ ఒక మహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం మొత్తం 600 మంది మార్గదర్శకులు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పదివేల బంగారు కుటుంబాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాలు బాగుపడాలని ఆకాంక్షించారు. స్వశక్తి కోసం 35 ఏళ్ల ముందు హెరిటేజ్ సంస్థ తీసుకొచ్చానని, కుటుంబానికి ఆర్థిక స్వావలంబన అవసరమన్నారు. నాలుగేళ్లలో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.