వృద్ధి రేటులో వెనుకడిన ప్రకాశం జిల్లా.. ప్రభుత్వం కీలక ప్రకటన
వృద్ధి రేటులో వెనుకడిన ప్రకాశం జిల్లా ఉందని ప్రభుత్వం ప్రకటించింది..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జిల్లాల వృద్ధి రేటు(Growth rate)ను ప్రభుత్వం ప్రకటించింది. వృద్ధి రేటులో ప్రకాశం జిల్లా(Prakasam District) బాగా వెనుకబడినట్లు వెల్లడించింది. రాష్ట్ర వృద్ధి రేటు 12.02 శాతం కన్నా ప్రకాశం జిల్లా శాతం తక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లా వృద్ధి రేటు 10.46 శాతం ఉన్నట్లు తెలిపింది. నెల్లూరు జిల్లా(Nellore District) వృద్ధి రేటు 14.45 శాతం, అన్నమయ్య జిల్లా(Annamaya District) వృద్ధి రేటు 13.22 శాతం, అన్నమయ్య తర్వాత స్థానంలో చిత్తూరు(Chittoor), తిరుపతి(Tirupati) జిల్లాలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డు(Mango board) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. తిరుపతిని డివైన్ డెస్టినేషన్‌గా మార్చాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.