AP Deputy CM:‘అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చాను’.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని అమరావతి(Amarawati)లో నేడు(ఆదివారం) పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని అమరావతి(Amarawati)లో నేడు(ఆదివారం) పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పీ-4 లోగోను ఆవిష్కరించారు. పీ-4 కోసం ప్రత్యేక పోర్టల్ (swarnaandhrap4@ap.gov.in) ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan) మాట్లాడుతూ.. పీ4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయని తెలిపారు.
కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కాస్త ధైర్యం చెబితే చాలు.. వాళ్లకు కొండంత అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలని సీఎం, నేను కోరుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం పై మరోసారి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రం కష్టాల్లో ఉందని.. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే సీఎం చంద్రబాబుకు మద్దతిచినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమర్ధ నాయుకుడు, అనుభవజ్ఞులు కాబట్టే చంద్రబాబుకు మద్దతిచ్చాను. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చిందని తెలిపారు.
సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎదుగుతున్న క్రమంలో మంచి సలహా ఇచ్చేవారని అన్నారు. సలహాలు ఇస్తే యువత అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. ఈ క్రమంలో మనమంతా చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర గా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణ నాయకుడు రాజకీయాలు, ఎన్నికల గురించే ఆలోచిస్తాడు. కానీ.. సీఎం చంద్రబాబు లాంటి విజనరీ నేత.. రాబోయే తరం గురించి ఆలోచిస్తారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.