అడవి తల్లి బాట: మన్యం నుంచి తిరిగొస్తూ పవన్ కల్యాణ్ ఏం చేశాడంటే?
పార్వతీపురం మన్యం జిల్లా(Manyam) అరకు నియోజకవర్గంలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Manyam) అరకు నియోజకవర్గంలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటించారు. ఈ సందర్భంగా పలు రహదారి పనులకు పనులకు శంకుస్థాపన చేశారు. పెదపాడు గ్రామంలో గిరిజనులతో భేటీ సమస్యలు తెలుసుకున్నారు. చాపురాయి దాటుకుంటూ గిరి శిఖర గ్రామానికి వెళ్ళారు. అక్కడి ప్రజలతో గంట సేపు మాట్లాడారు. పోతంగి పంచాయతీ పరిధిలోని పెదపాడు వాసులు తెలిపిన సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమస్యలను ఆరు నెలల వ్యవధిలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు చాపురాయి ప్రాంతాన్ని పరిశీలించారు. దుంబ్రిగూడ గ్రామంలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదు.. గిరిజనుల సంక్షేమమే మా ప్రభుత్వ ఆశయం అన్నారు. 2018లో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్ల పరిస్థితి చూసి ఆవేదన చెందానని.. ఆరోజు మాట ఇచ్చి మళ్లీ వచ్చానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏజెన్సీ అభివృద్ధి కోసం రూ. 92 కోట్లు ఖర్చు చేసింది. కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే రూ. 1,005 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. అడవితల్లి రుణం తీర్చుకోవడానికి ఏం చేయాలన్న ఆలోచనతోనే "అడవితల్లి బాట"(Adavi Thalli Baata) కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల యువత గంజాయి సాగు వీడి పర్యాటకం వైపు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.