Viral Video:స్కూల్‌లోకి ప్రవేశించిన ఎలుగుబంటి పిల్ల.. విద్యార్థి ఏం చేశాడో చూడండి!
జనావాసాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: జనావాసాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతోంది. పులులు, ఏనుగులతో పాటు ఎలుగుబంట్లు నివాస ప్రాంతాల్లోకి వస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని శంభుపుర గ్రామంలోని పాఠశాలలోకి ఎలుగుబంటి పిల్ల(BABY BEAR) ప్రవేశించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా స్కూల్‌లోకి భల్లూకం రావడంతో గ్రామస్తులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. మొదటగా ఆ ఎలుగుబంటి పిల్లను చూసి భయపడిన.. దాని పరిస్థితిని చూసి ఆ విద్యార్థులు జాలి పడ్డారు.
అది నీరసంగా ఉండటంతో పాఠశాల విద్యార్థి(Student) తమ సొంత టిఫిన్‌లో భోజనం పెట్టారు. వెంటనే ఆ బేబీ ఎలుగుబంటి ఆ బాక్స్‌లో పెట్టిన ఆహారం మొత్తం తినేసింది. ఈ ఎలుగుబంటి పిల్ల తన తల్లి నుంచి విడిపోయి.. దారి తెలియని పరిస్థితిలో పాఠశాలలోకి దూరింది. ఇక విషయాన్ని టీచర్లు అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పుడు దానిని తిరిగి తన తల్లితో కలిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ దాని తల్లి జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఎలుగుబంటి పిల్లను అభేదా బయోలాజికల్ పార్క్‌లో ఉంచారు.
అటవీ సంరక్షణాధికారి అనురాగ్ భట్నాగర్ మాట్లాడుతూ.. ఈ పిల్ల ఎలుగుబంటి వయస్సు ఒకటి నుంచి ఒకటిన్నర నెలలు ఉంటుందని అన్నారు. మా బృందం దీనిని రక్షించారని చెప్పారు. ఈ ఎలుగుబంటి పిల్ల తల్లి కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. ఈ ఎలుగుబంటి పిల్లకు ఇతర అడవి జంతువులు(Animals) నుంచి ప్రమాదం ఉండడంతో.. పాంథర్‌ను ట్రాప్ చేయడానికి ఒక బోను ఏర్పాటు చేశారు. ఇందులో ఎలుగుబంటి పిల్లను ఒకవైపు వదిలేస్తారు. ఈ క్రమంలో దాని తల్లి బోను దగ్గరకు వస్తే గేటు తెరచుకుంటుంది. దీంతో రెండు బోనులో ఉంటాయి. తర్వాత ఇద్దరినీ అడవిలోకి వదులుతారు. ప్రస్తుతం ఈ ఎలుగుబంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.