AP News : ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆస్తి పన్ను(Property Tax) బకాయిదారులకు ఏపీ కూటమి ప్రభుత్వం(AP Govt) భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

Update: 2025-03-25 12:20 GMT
AP News : ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఆస్తి పన్ను(Property Tax) బకాయిదారులకు ఏపీ కూటమి ప్రభుత్వం(AP Govt) భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ఆస్తి పన్నుపై వడ్డీ బకాయిల్లో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈనెల ఆఖరు వరకు పెండింగ్ లో ప్రాపర్టీ టాక్స్ వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ(50% Subsidy) కల్పిస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ప్రజల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో కొన్నేళ్లుగా పేరుకు పోయిన కోట్లాది రూపాయల బకాయిలు వసూలు అవుతాయని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై ప్రజలు, పన్ను బకాయి పడిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News