బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ ప్రమోషన్ ?
వైసీపీ పార్టీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత... మళ్లీ గ్రౌండ్ స్థాయిలో బలోపేతం అయ్యే

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ పార్టీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత... మళ్లీ గ్రౌండ్ స్థాయిలో బలోపేతం అయ్యేందుకు... వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తగ్గట్టుగానే వైసిపి పార్టీని... గ్రౌండ్ స్థాయిలో బలంగా తయారు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పార్టీలో (YCP Party) యంగ్ లీడర్లకు అవకాశం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ( Byreddy Siddhartha Reddy)... ప్రమోషన్ కూడా ఇచ్చారు జగన్.
యూత్ అలాగే మాస్ ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ( Byreddy Siddhartha Reddy)... వైసిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార విభాగమ అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్ కు అవకాశం వచ్చింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా శెట్టిపల్లి రఘురామిరెడ్డిని ( Shettipally Raghurami Reddy) నియమించారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, విశ్వేశ్వర రెడ్డి, కైలా అనిల్ అలాగే తానేటి వనితకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు వైసీపీ నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది.
అతి త్వరలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడే గ్రౌండ్ స్థాయిలో వైసిపి నేతలకు పదవులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి యంగ్ లీడర్లకు.... జగన్మోహన్ రెడ్డి పదవులు కట్టబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.