అజ్ఞాతంలోకి కాకాణి గోవర్ధన్ రెడ్డి ?

వైసీపీ (YCP) కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan Reddy) అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం అందుత

Update: 2025-03-29 06:24 GMT
అజ్ఞాతంలోకి కాకాణి గోవర్ధన్ రెడ్డి ?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ (YCP) కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan Reddy) అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం అందుతోంది. ఏ క్షణమైన కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేస్తారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు... జోరుగా ప్రచారం సాగుతోంది. తాటివర్తి లోని రుస్తుం మైన్స్ లో ( Rustom Mines ) అక్రమ మైనింగ్ కు సహకరించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన.. తాజాగా ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు.


అంతేకాదు ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని ఏపీ పోలీసులు అరెస్టు కూడా చేశారు. అటు కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అంటే వచ్చే మంగళవారం లోపు.. కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం సాగింది. కోర్టుకు వరుసగా సెలవులు రావడంతో... తనను అరెస్టు చేస్తారని... అనుచరులతో కాకాణి గోవర్ధన్ రెడ్డి చర్చించారట. ఇక నిన్న ఉదయం పార్టీ నేతలు అలాగే కార్యకర్తలతో ఉదయం పూట కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan Reddy).. సమావేశం సమావేశం నిర్వహించారని సమాచారం. ఈ సందర్భంగా విజయవాడ నుంచి లాయర్ ఫోన్ చేశారని చెప్పి... ఆ సమావేశం నుంచి వెళ్లిపోయిన కాకాని గోవర్ధన్ రెడ్డి.. ఎక్కడికి వెళ్లారని దానిపై ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నారు. దీంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని జోరుగా ప్రచారం అయితే మొదలైంది.

Tags:    

Similar News