వైసీపీకి బిగ్ షాక్.. త్వరలో మరొకరిపై అవిశ్వాసం...?
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగలనుంది...

దిశ, వెబ్ డెస్క్:రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి మరోసారి బిగ్ షాక్ తగలనుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘనంగా విజయం సాధించి అత్యధిక మున్సిపాటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. పలు మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు కూటమి ఖాతాలోకి వెళ్లాయి. తాజాగా విశాఖపట్నం మేయర్ పీఠంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా హరి కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టింది. దీంతో కార్పొరేషటర్లను కాపాడుకునేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది.
ఇంతలోనే మరో మున్సిపాలిటీలోనూ ఆ పార్టీకి కూటమి బిగ్ షాక్ ఇచ్చింది. పార్వతీపురం మున్సిపాలిటీని ఖాతాలో వేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిందేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. మొత్తం 30 వార్డు సభ్యులున్న ఈ మున్సిపాలిటీలో వైసీపీ(Ycp)కి 22 మంది వార్డు కౌన్సిలర్లు ఉండేవారు. అయితే కూటమి ఆపరేషన్ ఆకర్ష్‌కు 10 మంది కౌన్సిలర్లు టీడీపీ(Tdp), జనసేన(Janasena) పార్టీల్లో చేరిపోయారు. దీంతో కూటమి బలం 18కి చేరింది. వైసీపీ బలం 12కు పడిపోయింది. ఈ నేపథ్యంలో చైర్ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి పార్వతీపురం(Parvathipuram) మున్సిపాలిటీని చేజిక్కించేందుకు టీడీపీ, జనసేన నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.