నేను రాజీనామా చేస్తా.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Update: 2025-03-27 09:39 GMT
నేను రాజీనామా చేస్తా.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తా అని హెచ్చరించారు. రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి 10 రోజుల క్రితమే తీసుకెళ్లా అన్నారు. నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే ఛాలెంజ్... తిరువూరులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి వస్తా.. తేదీ, సమయం చెప్పండి. అంటూ సవాల్ విసిరారు. నా నియోజకవర్గంలో బాధితుడికి న్యాయం జరగకపోతే నేను ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.

ఏమిటి వివాదం?

తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ తన వ్యవహార శైలితో కొంతకాలంగా వార్తల్లోకి ఎక్కుతున్నారు. అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయన్ని పిలిపించుకుని మాట్లాడారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళతో సభ్యకరంగా మాట్లాడిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆడియో బహిర్గతం కావడానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ వర్గం మనుషులు ఉన్నారని ప్రచారం జరిగింది. రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా బాధితురాలికి మద్దతుగా గిరిజన మహిళలు ఆందోళనలు కూడా చేస్తున్నారు. వారికి మద్దతుగా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. 10 రోజులు అవుతున్న ఇప్పటికీ తాను చేసిన ఫిర్యాదు ఎటువంటి స్పందన లేదు అని కొలికపూడి ఆరోపిస్తున్నారు.

Similar News