‘చదువుకునే రోజుల్లో వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లం’.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్!
టాలీవుడ్(Tollywood) ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్(Director Meher Ramesh) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్(Director Meher Ramesh) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి ఇవాళ(గురువారం) హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. సత్యవతి మరణం గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె కన్ను మూశారని తెలిసి ఎంతో బాధ పడ్డాను. శ్రీమతి సత్యవతి గారి ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని కోరుకుంటున్నాను.
పవన్ కళ్యాణ్‌కు రమేష్, సత్యవతి(Satyawati) మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా సమయం గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబం విజయవాడ(Vijayawada)లోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.