Good News:రేపు ఆప్షనల్ హాలిడే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న(ఆదివారం) ఉగాది పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న(ఆదివారం) ఉగాది పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో నేడు(మార్చి 31) రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. అయితే రెండు పండుగల నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు వరుస సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. రేపు కూడా సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా రేపు(ఏప్రిల్ 1) ఆప్షనల్ హాలీడే(Optional Holiday)గా ప్రకటించారు. ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య:637 ద్వారా ఇవాళ(సోమవారం) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎస్ కే.విజయానంద్(CS K. Vijayanand) తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు.. ఈదుల్ ఫితర్(రంజాన్) పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఆప్షనల్ హాలిడేగా పేర్కొన్నారు. ఇక తెలంగాణలో కూడా రేపు(మంగళవారం) పబ్లిక్ హాలీడే ఉంది
Read More..