Marepalli: ఎట్టకేలకు.. గిరినాగు ముప్పు తప్పింది..!

అనకాపల్లి జిల్లాలో సంచరిస్తున్న గిరి నాగును స్నేక్ కేచర్లు బంధించారు..

Update: 2025-04-02 16:06 GMT

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 15 అడుగుల భారీ గిరినాగు (Giri Nagu) హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 29న పొలంతో రైతులను గిరినాగు భయబ్రాంతులకు గురి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా ఈ గిరినాగును బంధించారు. దేవరాపల్లి మండలం మారేపల్లి సమీపంలోని ఆయిల్ ఫామ్ తోట(Oil farm garden)లో గిరినాగు కనిపించింది. తోటలో పని చేస్తున్న కూలీల(Laborers)కు కనిపించడంతో వెంటనే స్నేక్ క్యాచర్ల(Snake Catchers)కు సమాచారం అందించారు. ఆయిల్ ఫామ్ తోట వద్దకు వెళ్లిన ఇద్దరు స్నేక్ క్యాచర్లు.. అరగంట పాటు శ్రమించి గిరి నాగును సజీవంగా బంధించారు. అనంతరం సంచిలో వేసుకుని తీసుకెళ్లారు. అడవుల్లో వదిలేస్తారా, అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తారా అనేది  చూడాల్సి ఉంది. 

Similar News