పిఠాపురంలో రికార్డింగ్ డాన్సులు !

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ( Pithapuram ) గురించి ర

Update: 2025-03-27 09:38 GMT
పిఠాపురంలో రికార్డింగ్ డాన్సులు !
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ( Pithapuram ) గురించి రోజుకో వార్త తెరపైకి వస్తోంది. లైంగిక వేధింపులు, జనసేన ( Janasena ) వర్సెస్ తెలుగుదేశం పార్టీ ( TDP) నేతల మధ్య గొడవలు లాంటి సంఘటనలు నిత్యం పిఠాపురం నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్సులు ( Recording dances) కూడా... నిర్వహించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా 12 మంది అమ్మాయిలతో అర్ధరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు.


ఈ సంఘటన పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మూలపేట గ్రామంలో ( Mulapet ) పోలేరమ్మ జాతర ( Poleramma Jathara) జరిగింది. ఈ సందర్భంగా 12 మంది అమ్మాయిలతో అర్ధరాత్రి వరకు రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. అర్ధ నగ్నంగా... 12 మంది అమ్మాయిలు రికార్డింగ్ డాన్సులు చేస్తుంటే... ఆ గ్రామస్తులు తెగ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండని వారు కూడా... ఈ ఈవెంట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఈ రికార్డింగ్ డాన్స్ లు నిర్వహించారట. అయితే కూటమి పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఈవెంట్ నిర్వహించినట్లు వైసిపి పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయి ఉండి కూడా... ఇలాంటి సంఘటనలు జరగడం దారుణం అంటున్నారు వైసీపీ నేతలు.

Tags:    

Similar News