Tekkali: విద్యుత్ శాఖ ఏఈకి ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీరు వివాదస్పదమైంది......

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(YCP MLC Duvvada Srinivas) తీరు వివాదస్పదమైంది. కరెంట్ విషయంలో విద్యుత్ శాఖ ఏఈ(Electricity Department AE)పై బెదిరింపులకు దిగారు. టెక్కలి(Tekkali) నుంచి పారిపోయేలా చేస్తానంటూ మురళీకృషను బెదిరించారు. దీంతో దువ్వాడపై విద్యుత్ ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) టెక్కలిలోని తన ఇంటికి దువ్వాడ శ్రీనివాస్ కొన్ని నెలలుగా కరెంట్ బిల్లు చెల్లించడంలేదు. రూ. 56 వేలు వరకూ విద్యుత్ బకాయి ఉండటంతో దువ్వాడ ఇంటికి కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఏఈ మురళీకృష్ణకి ఫోన్ చేసి.. ‘‘ నా ఇంటికే కరెంట్ కట్ చేస్తావా..?. ఎంత ధైర్యం నీకు. టెక్కలి నుంచి పారిపోయేలా చేస్తా. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా..?. కోర్టుకు లాగుతా, ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా.’’ అంటూ బెదిరించారు. దీంతో దువ్వాడ తీరు వివాదాస్పదమైంది. దువ్వాడ కరెంట్ బిల్లు బకాయి కట్టకుండా విద్యుత్ అధికారులను బెదిరించడమేంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు కూడా దువ్వాడ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అధికారం పోయినా దువ్వాడకు పొగరు తగ్గలేదని టీడీపీ నాయకులు అంటున్నారు. బిల్లు కట్టకపోతే ఎవరికి ఇంటికైనా విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికైనా కరెంట్ బిల్లు చెల్లించి.. ఏఈ మురళీకృష్ణకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.