టెన్త్ పరీక్షలు రాస్తుండగా ప్రత్యక్షమైన డీఈవో.. 14 మంది టీచర్లు సస్పెండ్

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూలులో మాస్ కాపీయింగ్ కలకలం రేగింది..

Update: 2025-03-23 10:30 GMT
టెన్త్ పరీక్షలు రాస్తుండగా ప్రత్యక్షమైన డీఈవో.. 14 మంది టీచర్లు సస్పెండ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూలు(Kuppili Model Schoo)లో మాస్ కాపీయింగ్ కలకలం రేగింది. ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు(Tenth class exams) జరుగుతున్నాయి. అయితే మాస్ కాపీయింగ్‌(Mass copying)కు టీచర్లు, ఇన్విజిటర్లు సహకరించారు. మాస్ కాపీయింగ్‌పై ఓ విద్యార్థి కంప్లైంట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం గుట్టు రట్టు అయింది. నాలుగు టీములు స్కూల్లో తనిఖీలు చేశారు. మాస్ కాపీయింగ్‌ను 14 మంది ఉపాధ్యాయులు, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్‌ పోత్సహించినట్లు గుర్తించారు. వెంటనే వారిపై సస్పెన్షన్ వేటు చేశారు. ఐదుగురు విద్యార్థులను డీబార్ చేశారు.


ఈ ఘటనపై డీఈవో కృష్ణ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం విద్యార్థుల చూసి రాతకు టీచర్లు సహకరించడంపై మండిపడ్డారు. కొందరు పెద్దలు చేసిన పనికి విద్యార్థులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రింట్ పేపర్ సురక్షితంగానే ఉందని, విద్యార్థులు రాసిన పేపర్లు బయటకు వెళ్లడంతోనే మాస్ కాపీయింగ్‌ జరిగిందని  తెలిపారు. ఇలా చేయడం వల్ల తెలివైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని డీఈవో కృష్ణ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అయితే ప్రభుత్వ స్కూల్లో జరిగిన ఈ ఘటనతో విద్యా శాఖ అధికారులు షాక్‌కు గురయ్యారు.కుప్పిల్ మోడల్ స్కూల్లో రెండు ఎగ్జామ్స్ సెంటర్లు ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో ఈ స్కూల్లో మాసీ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో డీవో కృష్ణ చైతన్యకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేయడంతో అధికారుల బృందం రైడ్ చేసింది. దీంతో అసలు విషయం తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటనపై డీఈవో కృష్ణ చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాస్ కాపీయింగ్‌పై దర్యాప్తు జరుగుతోంది.

Tags:    

Similar News