షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌‌లకు వెళ్లే వారికి ప్రభుత్వం శుభవార్త.. సినిమా టికెట్ చూపిస్తే మొత్తం ఉచితం

రాష్ట్ర ప్రభుత్వం(Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల్స్‌లోని పార్కింగ్ ఫీజు(Parking Fee)లపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Update: 2025-03-25 12:48 GMT
షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌‌లకు వెళ్లే వారికి ప్రభుత్వం శుభవార్త.. సినిమా టికెట్ చూపిస్తే మొత్తం ఉచితం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల్స్‌లోని పార్కింగ్ ఫీజు(Parking Fee)లపై ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్‌ పూర్తిగా ఉచితమని.. 30 నిమిషాల నుంచి గంట వరకు పార్కింగ్‌ చేసిన వ్యక్తులు మల్టీప్లెక్స్‌(Multiplexes)లు, మాల్‌లలో ఏదైనా వస్తువు కొన్నట్లుగా బిల్లులు, సినిమా(Movie) టికెట్లు చూపిస్తే అలాంటి వారికి ఎలాంటి ఫీజులు వర్తించవని పేర్కొన్నది. షాపింగ్ మాల్స్(Shopping Malls), మల్టీప్లెక్స్‌(Multiplexes) యజమానులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది.

Tags:    

Similar News