రాష్ట్రంలో మరో దారుణం.. 8 ఏళ్ల చిన్నారిపై లైంగికదాడి
రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న లైంగికవేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న లైంగికవేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కామంధులు రెచ్చిపోతున్నారు. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సమాజంలో మనుషులు రోజు రోజుకు విచక్షణ కోల్పోయి.. మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, కామాంధుల ఆకృత్యాలకు అడ్డుకట్ట పడట్లేదు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 ఏళ్ల చిన్నారిపై ఓ కీచకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు ఆ చిన్నారిని లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సమాచారం. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.