Breaking: ఏపీలో పీ4 కార్యక్రమం ప్రారంభం
ఏపీలో పీ4 కార్యక్రమం ప్రారంభమైంది..
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పీ4 కార్యక్రమం(P4 Program) ప్రారంభమైంది. వెలగపూడి సచివాలయం దగ్గర ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు(Cm Chandrababu) శ్రీకారం చుట్టారు. పేదల బాగుకు మార్గదర్శి-బంగారు కుటుంబం నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పీ4లో ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వాములు కానున్నారని చెప్పారు. అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యమన్నారు. పేదరికం నుంచి ప్రజలను పైకి తేవాలనేది పీ4 పథకం ఆశయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.