MP Arvarind: కవిత బ్యూటీ పార్లర్ పెట్టి ఫేమ్ సంపాదించిందా?: ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-04-13 11:29 GMT
MP Arvarind: కవిత బ్యూటీ పార్లర్ పెట్టి ఫేమ్ సంపాదించిందా?: ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై (Pawan Kalyan) చేసిన కామెంట్లపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvarind) మరోసారి రియాక్ట్ అయ్యారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని, ఎన్నికల్లో పోటీ చేయలేని వారు ఇవాళ మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ కు రాజకీయాల్లోకి రాకముందే కోట్లాది మంది అభిమాలతో పెద్ద ఫేమ్ సంపాదించుకున్నారని మరి కవిత బ్యూటీ పార్లర్ పెట్టి ఫేమ్ సంపాదించుకున్నారా? అని కామెంట్ చేశారు. ఇవాళ నిజామాబాద్ లో ‘గావ్ చలో- బస్తీ చలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి కంటే నాలుగు రేట్లు ఎక్కువ సంపాదించే పవన్ కల్యాణ్ ఆ సంపాదనను, సినిమాలను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారని ఇది చాలా పెద్ద త్యాగం అన్నారు. ‘నన్ను చెప్పులతో కొట్టిస్తానని గతంలో కవిత అన్నారని కానీ ఇటీవల ఓ మహిళను అడిగితే బాత్ రూమ్ చెప్పుతో కూడా ఆమెను కొట్టనని చెప్పిందని’ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తుందా పోతుందా అని తన తండ్రి కేసీఆర్ ను తిట్టినోలు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టిన కుటుంబం తమ కుటుంబం అన్నారు. అంబేద్కర్ ను రాజకీయంగా వాడుకోవడం తప్ప ఆయనను ఏనాడు కాంగ్రెస్ (Congress) పార్టీ గౌరవించలేదని విమర్శించారు. అబేంద్కర్ ను రాజకీయంగా, మానసికంగా హింసించి ఆయన చావుకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అలాంటి పార్టీ అంబేద్కర్ పేరుతో రాజకీయం చేయడం ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి లేదన్నారు. ఈ దేశంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాతే అంబేద్కర్ కు భారత రత్న వచ్చిందని గుర్తు చేశారు. 

Tags:    

Similar News