Viral Photo:అచ్చం హనుమాన్‌ని పోలీ ఉన్న కొండ.. చూసి తరించాల్సిందే! ఎక్కడో తెలుసా?
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో దర్శనిమిస్తున్న ఫొటోలు, వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో దర్శనిమిస్తున్న ఫొటోలు, వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇక వింతలు విశేషాలకు కొదువే లేదు. ఈ తరుణంలో ప్రకృతికి సంబంధించిన వీడియోలైతే అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రకృతిలో ఎన్నో వింతలను మనం చూస్తూనే ఉంటాం. కొండ ప్రాంతాలు, చెట్లు, విశాలమైన మైదనాలు, ప్రకృతి ఒడిలో విలాసవంతంగా గడుపుతున్న పక్షులు, జంతువులను చూస్తుంటే సరదాగా అనిపిస్తుంటుంది. అయితే ప్రకృతిలో కొండలు, చెరువులు, సేలయేరు, ఆకాశంలో మేఘాలు చూస్తే వింత వింత ఆకారంలో కనిపిస్తుంటాయి,
ఇదిలా ఉంటే.. చాలా మంది దేవుళ్ళను విశ్వసిస్తారు. ఈ క్రమంలో భక్తి శ్రద్దలతో తమ ఇష్ట దైవానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. హిందూ దేవాలయాలలో దేవుడి విగ్రహాలు చాలా అద్భుతంగా నిర్మితమై ఉంటాయి. ఈ విగ్రహాలు కొన్ని మానవులు నిర్మించినవైతే.. మరికొన్ని స్వయంభూగా కొలువైనవిగా చెబుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది భక్తులు స్వయంగా వెలసిన దేవుళ్ల విగ్రహాలు పవిత్రంగా భావించి ఆరాధిస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కొండ స్వయంభూ హనుమాన్(Hanuman) స్వరూపాన్ని కలిగి ఉంది. పెద్ద పెద్ద కొండ ప్రాంతాల్లో సహజంగా ఆవిర్భవించింది.
ఈశాన్య భారతదేశం(India)లోని అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లోని మెచుకా పట్టణం కొండ ప్రాంతాల్లో హనుమాన్ దివ్య స్వరూపం దర్శనమిస్తుంది. ఈ హనుమాన్ స్వరూపాన్ని యార్లుంగ్ ఆర్మీ క్యాంపు(Yarlung Army Camp) వైపు ప్రయాణిస్తున్న సమయంలో వారికి ఎదురుగా ఉన్న కొండ పై సహజంగా ఏర్పడిన హనుమంతుని ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మెచుకా లాలో ఇది అత్యంత పురాతన పర్వతం గా పిలుస్తారు. పర్వత ప్రాంతానికి వెళ్లే దారుల్లో భారత సైన్యం శిబిరాలు ఉంటాయి. ప్రత్యేక అనుమతితోనే ఈ ప్రాంతంలో పర్యటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మెచుకలా పర్వతాల్లోని కొండపై వెలసిన హనుమాన్ స్వరూపం ఆధ్యాత్మిక అనుభూతిలో విహరింప చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
