Betting Apps Pramotions Case : బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తే తప్పేంటి? : హీరోయిన్ ఆవేదన

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనంగా మారింది.

Update: 2025-03-21 14:16 GMT
Betting Apps Pramotions Case : బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తే తప్పేంటి? : హీరోయిన్ ఆవేదన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనంగా మారింది. ఈ వివాదంలో కొంతమంది తెలుగు సినిమా స్టార్లు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈకేసులో ప్రముఖంగా వినిపిస్తున్న తెలుగు హీరోయిన పేరు అనన్య నాగల్ల(Ananya Nagalla). గత రెండు రోజులుగా ఈ నటి పేరు వార్తల్లో మారుమోగుతుండటంతో.. ఎట్టకేలకు ఈ అమ్మడు నోరు విప్పింది. "బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని మాకు ఇప్పుడే తెలిసింది. బాలీవుడ్‌లో పెద్ద స్టార్లు, క్రికెటర్లు కూడా ఇలాంటివి ప్రచారం చేశారు కదా, వాళ్ళు అన్నీ తెలుసుకునే చేస్తారని అనుకున్నాం. హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro Rail)లో కూడా ఇలాంటి ప్రకటనలు కనిపిస్తే, అది చట్టవిరుద్ధమని మాకు ఎలా తెలుస్తుంది?" అని ఆమె ప్రశ్నించారు. కాగా పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు అనన్యతో సహా పలువురు సినీ తారలు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశారు.

మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫణీంద్ర శర్మ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత డబ్బు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అనన్యతో పాటు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ వివాదంపై అనన్య స్పందిస్తూ.. తెలియకుండా ఈ ప్రమోషన్స్ చేశానని, ఇతర పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలాంటివి చేశారని చెప్పారు. అయితే, ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదం అవడంతో ఆమె క్షమాపణ చెప్పినట్టు సమాచారం. 

Tags:    

Similar News