RC16 కోసం హైదరాబాద్‌కు వచ్చిన కన్నడ స్టార్.. పెద్దమ్మ ఆలయంలో సందడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ఓ మూవీ చెయ్యబోతున్నాడు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ఓ మూవీ చెయ్యబోతున్నాడు. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయింది. రీసెంట్‌గా వచ్చిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం హిట్ అందుకోకపోవడంతో.. చర్రి ఫ్యాన్స్ ‘RC16’పై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ నటుడు దివ్యేందు శర్మతో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా.. రీసెంట్‌గా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారట చిత్ర బృందం. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పాత్రకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రీసెంట్‌గా హైదరాబాద్‌కు చేరుకున్నారు శివరాజ్ కుమార్. ఆయన హైదరాబాద్ రాగానే.. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధ సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.