Court movie: 10 రోజుల కలెక్షన్లు ప్రకటన విడుదల చేసిన కోర్టు మూవీ టీమ్..?
జగదీష్ (Jagadish) దర్శకత్వం వహించిన కోర్టు (Court) సినిమా ప్రస్తుతం మంచి టాక్ సొంతం చేసుకుంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: జగదీష్ (Jagadish) దర్శకత్వం వహించిన కోర్టు (Court) సినిమా ప్రస్తుతం మంచి టాక్ సొంతం చేసుకుంటుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీని టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నిర్మించిన విషయం తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం మార్చి 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కోర్టు రూమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో శ్రీదేవి అండ్ రోషన్ అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి కాంబోలోనే సాంగ్స్ వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి. కోర్టు మూవీ జనాల్ని అంతగా ఆకట్టుకుంది మరీ. ముఖ్యంగా ఇందులో సీనియర్ నటుడు శివాజీ (Shivaji)అద్భుతమైన ఫర్మామెన్స్ ఇచ్చారంటూ సుకుమార్ ఇప్పటికే పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
అలాగే నటుడు ప్రియదర్శి (Priyadarshi) లాయర్‌గా వాదించి గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మరీ పది రోజుల్లో కోర్టు మూవీ కలెక్షన్లు ఎంతో తాజాగా మూవీ టీమ్ తెలిపింది. నాని నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని ప్రకటించారు. అలాగే ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ అని వెల్లడించింది.
Read More..
రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. నా ఆటోగ్రాఫ్ మూవీ రీరిలీజ్ ముహూర్తం ఖరారు..