Shruti Haasan: ఆ స్టార్ డైరెక్టర్‌పై శృతి హాసన్ కామెంట్స్.. మళ్లీ ఊపందుకున్న ప్రేమ వార్తలు!
మల్టీ టాలెంటెడ్‌గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది హీరోయిన్ శృతి హాసన్

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్‌గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan). ప్రస్తుతం ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో భాగంగా శృతి హాసన్ త్వరలో ‘కూలీ’ (coolie) చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రజినీ కాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటు శృతి హాసన్ రజినీ కాంత్, డైరెక్టర్ లోకేష్ కగకరాజ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘సూపర్ స్టార్ రజినీకాంత్‌తో వర్క్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన అంత పెద్ద స్టార్ ఎలా అయ్యారో.. ఆయనతో కలిసి వర్క్ చేయడం వల్ల అర్థం అయింది. ఆయనలో ఉండే అంకితభావం, పాత్ర కోసం కష్టపడే తత్వం ఈరోజు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టాయి. వ్యక్తిగతంగా కూడా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రజినీకాంత్ సెట్‌లో ఉంటే అందరిలో ఓ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది. ఇక ఇష్టమైన డైరెక్టర్ ఎవరూ అని అడగ్గా.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు చెబుతూ ‘ఆయనతో వర్క్ చేయడంతో నా కల నెరవేరింది’ అని తెలిపింది. కాగా.. లోకేష్ కనగరాజ్, శృతి హాసన్ ఇద్దరూ కలిసి గతంలో ఓ యాడ్ కూడా షూట్ చెయ్యగా.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే న్యూస్ కూడా నెట్టింట వైరల్ అయింది. ఇప్పుడు తనకు ఇష్టమైన డైరెక్టర్స్‌లో లోకేష్ పేరు చెప్పడంతో మరోసారి వీరి ప్రేమ వార్తలు ఊపందుకున్నాయి.