మోగ్లీ నుంచి పబ్లిక్ స్టార్ పోస్టర్ రిలీజ్.. క్యాండిల్‌తో సిగరేట్ వెలిగించుకుంటూ వైల్డ్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడుగా

స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్(Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’(Mogli).

Update: 2025-03-31 06:34 GMT
మోగ్లీ నుంచి పబ్లిక్ స్టార్ పోస్టర్ రిలీజ్.. క్యాండిల్‌తో సిగరేట్ వెలిగించుకుంటూ వైల్డ్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడుగా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్(Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’(Mogli). ‘కలర్ ఫొటో’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్(Sakshi Madolker) హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ అమ్మడు ఈ చిత్రంతోనే సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకుని సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి.

ఈ క్రమంలో నిన్న ఉగాది(Ugadi Festival) సందర్భంగా ‘మోగ్లీ నుంచి అత్యంత క్రూరమైన మృగం(Wild Beast) రాబోతుంది అని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఇచ్చిన మాట ప్రకారం నేడు పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్(BANDI SAROJ KUMAR) ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

అలాగే అతను ఈ సినిమాలో సబ్ ఇన్‌స్పెక్టర్ క్రిస్టోపర్ నోలన్(NOLAN) పాత్రలో మెప్పించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ పోస్టర్‌లో సరోజ్ కుమార్ సిగరెట్‌ను క్యాండిల్‌తో అంటించుకుని ఎవరినో కోపంగా చూస్తున్నాడు. అలాగే అతని మొహం మీద అక్కడక్కడ దెబ్బలు, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా(Social Medai)లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Tags:    

Similar News