మెగాస్టార్- అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. సూపరో సూపర్ అంటున్న నెటిజన్లు
టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని నిన్న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. కాగా ఈ పూజా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) హాజరయ్యారు.
ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన సంగతి తెలిసిందే. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మెగా 157 (#Mega157), చిరు అనిల్ (#ChiruAnil) అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా క్రేజీ నటి అదితి రావు హైదరి(aditi Rao Hydari) పేరు తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాజాగా డైరెక్టర్ మరో బాలీవుడ్ బ్యూటీని సంప్రదించినట్లుగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఆమెకు అనిల్ రావిపూడి కథ కూడా చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు స్టార్ బ్యూటీ పరిణీతి చోప్రా. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వీరిద్దరి కాంబోలో సినిమా అంటే సూపరో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఫైనల్‌గా అదితి రావు హైదరీ, పరిణీతి చోప్రా.. ఇద్దరిలో ఎవరు ఈ సినిమాలో కనిపించనున్నారనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.